TS 10th Class Exam: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 5 నిమిషాల గ్రేస్ టైమ్ ప్రకటించిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS 10th Class Exam: తెలంగాణ సర్కార్ 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్ ట్రైం ను ప్రకటించింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరడనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్ లేకుండా రావచ్చని భావిస్తున్నారు. అయితే.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్‌టైమ్ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతించారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలిన వాటికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు, పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు రోజులూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి.
Read also: Election Commissioner: నేడు ఎన్నికల కమిషనర్ల ఎంపిక.. ప్రధాని మోడీతో కీలక భేటీ
Also Read
రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు సహా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ, రెవెన్యూ శాఖ నుంచి ఒక్కో అధికారి, ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించనున్నారు. ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు జారీ చేస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ నుంచి వివరణ కోరాలని ఇన్విజిలేటర్లను ఆదేశించారు.
Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్
తాజావార్తలు
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!