NTV Telugu Site icon

Godavari at Bhadrachalam: ఉగ్రరూపం దాల్చిన గోదా‌వరి.. 54.3 అడు‌గు‌లకు నీటి మట్టం

Godavari River

Godavari River

Godavari at Bhadrachalam: ఎగువన కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 54.3 అడు‌గు‌లకు చేరు‌కుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధి‌కా‌రులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. కాగా గోదా‌వరి నీటిమట్టం పెరు‌గు‌తుం‌డ‌టంతో భద్రా‌చలం, పిన‌పాక నియో‌జ‌క‌వ‌ర్గా‌ల్లోని పలుమండ‌లాలు అనేక గ్రామాలు జల‌ది‌గ్బం‌ధంలో చిక్కు‌కు‌న్నాయి. భద్రా‌చలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహ‌దా‌రిపై వరద నీరు పెద్దఎత్తున ప్రవ‌హిం‌చ‌డంతో రాక‌పో‌క‌లకు అంత‌రాయం కలి‌గింది. భద్రా‌చలం నుంచి ఛత్తీ‌స్‌‌గఢ్‌, ఒడిశా ప్రాంతా‌లకు వెళ్లే‌ప్రధాన రహ‌దా‌రిపై నెల్లి‌పాక వద్ద వరద నీరుచేర‌డంతో రాక‌పో‌కలు పూర్తిగా స్తంభించాయి.

Godavari 3rd Warning: 53 అడుగులకు గోదారి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

తగ్గినట్లే తగ్గి మళ్లీ వరద పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం 54.3 అడుగుల వద్దకు చేరకుంది. పై నుంచి వస్తున్న వరద వల్ల ఈ నెల రోజుల్లో మూడు సార్లు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద వచ్చి చేరింది. దీంతో ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్ల మీదకు నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. భద్రాచలం నుంచి చర్ల వెంకటాపురం రహదారి మీదికి వరద నీళ్లు భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే రహదారిపై రోడ్లపై వరద నీళ్లు చేరాయి. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. గోదావరి నది ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి కోరారు. అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందాలి.24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీసు వారి సూచనలు పాటించాలని కోరుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి మరలా ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న కారణంగా పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెల్లడించారు.

Show comments