Girl Suspicious Death: వీడని సస్పెన్స్.. ఉద్రిక్తతల నడుమ చిన్నారి అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Indu Suspicious Death: సంచలనం సృష్టించిన మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో చిన్నారి ఇందు మృతి కేస్ లో సస్పెన్స్ ఇంకా వీడలేదు. దర్యాప్తు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశారు. చిన్నారి మృతికి గల కారణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ లతోపాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో కేస్ విచారణ చేపట్టారు. ఇందు తల్లిదండ్రుల మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చిన్నారి ఇందు అంత్యక్రియలు ఇవాళ చేయనున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గురువారం దమ్మాయిగూడ పరిధిలో బాలిక ఇందు అదృశ్యమైన ఘటన విషాదాంతంగా మారింది. గురువారం ఉదయం 9గంటలకు పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు శుక్రవారం అంబేడ్కర్ నగర్ చెరువులో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సాయంత్రం గర్ల్ మిస్సింగ్ కేస్ ను పోలీసులు కేసు నమోదు చేశారని బాలిక తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిన్ననే సెర్చ్ ఆపరేషన్ చేసుంటే బాలిక ఆచూకీ దొరకేదని చెబుతున్నారు. పోలీసుల జాప్యం వల్లే బాలికకు ఈ పరిస్థితి ఎదురైందనీ ఆరోపించారు. ఇందు మృతదేహాన్ని వైద్యపరీక్షలు చేయించారు. బాలిక ఒంటిపై గాయాలు లేవని, నీరుతాగి చనిపోయిందని తెలుపుతున్నారు. అయితే మృతురాలు ఇందు తల్లిదండ్రులు ఇందు పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వకుండా డెడ్ బాడీని అప్పగించారంటూ ఆందోళన చేపట్టారు.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
Read also: US Fighter Jet Crash: హెలికాప్టర్ మాదిరి ల్యాండింగ్.. అదుపు తప్పి కూలిన ఫైటర్ జెట్
పోలీసులు వాహనాలపై కర్రెలతో దాడి చేశారు. అయితే ఇవాల ఇందు అంత్యక్రియల నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఉద్రిక్తతల నడుమ ఇందు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే.. పాప ఒంటిపై గాయాలు, నడుము భాగంలో గాయాలు గుర్తించామని చెబుతున్నారు. నిన్న రాత్రి చెరువు వరకు డాగ్స్‌స్క్వాడ్ వెళ్ళిందని, అక్కడ మమ్మల్ని పంపీయలేదని వాపోయారు. పోలీసులకు నిన్న రాత్రే విషయం తెలుసని, పోలీసులు దాచి పెట్టారని చెబుతున్నారు. మా పాపపై అఘాయిత్యానికి పాల్పడే చంపారని కన్నీరుమున్నీరవుతున్నారు బాధిత తల్లిదండ్రులు. ఈ విషయం తెలిసే పోలీసులు నిన్న చెప్పకుండా దాచి పెట్టారంటున్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉంటుందని, అలాగే ఇటుక బట్టీలు తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలుపుతున్నారు. వాళ్లలో ఎవరైనా పాపపై అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధిత తల్లిదండ్రులు. ఎక్కడో వేరే దగ్గర చంపి తీసుకొచ్చి చెరువు దగ్గర పాప డెడ్‌బాడిని పడేశారని గుండెపగిలేలా రోదిస్తున్నారు. అయితే అనుమాదాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!