Site icon NTV Telugu

కౌశిక్ రెడ్డికి షాక్‌.. జీహెచ్‌ఎంసీ భారీ ఫైన్‌..

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

ఇవాళే టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డికి భారీ షాక్‌ ఇచ్చింది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ).. ఈ మధ్యే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన హుజురాబాద్‌ అసెంబ్లీ నియోకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌ రెడ్డి.. ఇవాళ తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.. కౌశిక్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీర్.. అయితే, తన చేరిక సందర్భంగా.. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు కౌశిక్‌ రెడ్డి.. గ్రేటర్‌లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఆయనకు రూ. 2,50,000 ఫైన్ విధించింది.. నగర వాసుల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో కౌశిక్ రెడ్డికి ఫైన్‌ విధించినట్టు తెలుస్తోంది.

Exit mobile version