రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు.. సిరిసిల్లా టౌన్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.. పార్క్ చేసిన కార్లు.. పడవలుగా మారిపోయాయి కొట్టుకుపోయాయి.. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే.. ముంపులో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నవారు మరికొందరు.. అయితే, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సిరిసిల్లాకు బయల్దేరాయి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు.. హైదరాబాద్‌లో వరదల సమయంలో.. డీఆర్‌ఎఫ్ బృందాలు చాలా కీలక పాత్ర పోషించాయి.. ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బోట్లు, ఇతర సహాయ పరికరాలతో హైదరాబాద్ నుంచి డీఆర్‌ఎస్ బృందాలు సిరసిల్లకు వెళ్తున్నాయి. సిరిసిల్లాలో వరద సాహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్‌లో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొననున్నాయి.. సహాయక చర్యల్లో 25 మందితో కూడిన… రెండు డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటాయి.
కాగా, ఇవాళ ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పట్టణ మున్సిపల్ కమిషనర్ తో టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు మంత్రి కేటీఆర్.. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణంలోని పలు కాలనీలు జలమయమయినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. దీంతో వెంటనే వరద ప్రభావిత కాలనీల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి సిరిసిల్ల పట్టణంలోని కాలనీల్లో ఇప్పటికే వరద ఉదృతి పెరిగింది. రానున్న 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వుండాలని కేటీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా రెండు డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిరిసిల్లకు పంపించారు.