Cyberabad Traffic Police Issues Heavy Rain Alert for Hyderabad: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గత 5-6 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వానలతో దాదాపుగా అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలకు చెరువులు, జలాశయాలు నిండిపోయాయి. మరోవైపు రహదారులపై వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రయాణికులు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు.
ఈరోజు హైదరాబాద్‌లో భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర వాసులకు ఓ సూచన చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ చూసుకోవాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోవాలని ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
Also Read: Asia Cup 2025: 2 మ్యాచ్‌లే గెలిచి.. ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్!
ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. మరికొన్ని చోట్ల వర్షం పడుతోంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంమీల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆగస్టు 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
FLOODING RAINFALL WARNING ⚠️⛈️
Dear people of Telangana, due to LOW PRESSURE IMPACT, there will be FLOODING RAINS during next 4days ⚠️🌊
August 12-13 – VERY HEAVY FLOODING RAINS expected in South, East Telangana. Flooding rains (150-200mm) rains expected in few places ⚠️… pic.twitter.com/uzA8jzIpTh
— Telangana Weatherman (@balaji25_t) August 12, 2025