NTV Telugu Site icon

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్ లో ఓయో రూమ్స్ రగడ.. హాట్‌హాట్‌గా మీటింగ్‌

Ghmc Telagana

Ghmc Telagana

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రెండో రోజు వాడివేడిగా సాగుతోంది. ఇవాళ ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే GHMC కౌన్సిల్ హల్ లో ఓయో రూమ్స్ రగడ మొదలైంది. ఓయో రూమ్స్ పై కార్పొరేటర్లు హాట్ హాట్ గా మాటల యుద్ధం జరిగింది. రెసిడెన్సీయల్ పేరుతో కమర్షల్ నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాల్లో ఓయో బిసినెస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెంట్స్ పేరుతో కమర్షల్ బిజినెస్ పేరుతో వ్యాపారం చేస్తుంటే GHMC పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓయో రూమ్స్ నిబంధనల పై క్రాస్ చెక్ చెయ్యాలి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

Read also: Kishan Reddy: విజయసంకల్ప రథ యాత్రలకు బీజేపీ శ్రీకారం.. ఎన్నిక ప్రచారంలో కిషన్‌ రెడ్డి

ఈ సందర్భంగా కౌన్సిలర్లు ప్రజా సమస్యలను సభలో లేవనెత్తారు. హైదరాబాద్‌లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో స్పోట్స్ తక్కువగా ఉన్నాయని, ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నాయని కార్పొరేటర్లు చెబుతున్నారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల పట్ల అధికారులు కుక్కల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కనీసం అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. కాగా, నిన్నటి కౌన్సిల్ సమావేశం హాట్ హాట్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్న భోజనానికి ముందు గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చ జరగనుంది. భోజనం తర్వాత, మేయర్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.8437 కోట్ల GHMC బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.7937 కోట్లతో సాధారణ బడ్జెట్, డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.500 కోట్లతో బడ్జెట్ రూపొందించారు.
Rahul Gandhi: అమిత్ షాపై కామెంట్స్.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..