NTV Telugu Site icon

Stray Dogs: ఇదే పని ముందే చేసి ఉంటే.. అంబర్ పేట చిన్నారి ప్రాణాలు దక్కేవే..

Fogs Ataks

Fogs Ataks

Stray dogs: సంతోష్ నగర్ కాలనీలో ఐదేళ్ల బాలుడిపై వీది కుక్క దాడి ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలో కుక్కలను పట్టుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఉదయం నుంచి సంతోష్ నగర్ పరిసరాల్లో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.. వీధి కుక్కల పరుగెడుతుంటే వాటి వెంటపడి పట్టుకుంటున్నారు. కుక్కల కోసం అన్నీ వీధులు, కాలనీల్లో తిరుగుతున్నారు. వారిని చూసి వీధి కుక్కలు పారిపోతున్నాయి

అటు మనుషులపై కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న సంతోష్ నగర్.వారం క్రితం కాంచన్ బాగ్. అంతకు ముందు అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతితో పాటు పలు ఘటనలు చోటు చేసుకున్నాయి.సంతోష్ నగర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల పిల్లాడు అబ్దుల్ రఫె వీధి కుక్క దాడి చేసింది. పిల్లాడు కేకలు వెయ్యడంతో.. ఆ అరుపులు విన్న స్థానికులు.. పిల్లాణ్ని కాపాడారు. అప్పటికే ఆ కుక్కలు.. పిల్లాడి కాళ్ళు. వీపు, చేతిని విచక్షణా రహితంగా దాడి చేశాయి. దీంతో కుటుంభ సభ్యులు పరుగున ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల దాడిలో రోజుకో చిన్నారులు గురవుతునే వున్నారు. చిన్న పిల్లల్ని వీధిలో వదలాలంటేనే తల్లిదండ్రులు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు.

చిన్నారులపైనే కాకుండా పెద్దలపై కూడా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. అటు చిన్నారు, ఇటు పెద్దవారు అనే తేడాలేండా శరీరాలను పీక్కుతుంటున్నాయి. కొందరు బతికి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుంటుంటే మరి కొందరు కుక్కల దాడికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలో ఎక్కువ చిన్నారులే కావడం గమనార్హం. మొత్తంగా నగరంలో ఈ వీధి కుక్కల సమస్య తలనొప్పిగా మారింది. ఇక దీంతో జీహెచ్‌ ఎంసీ అలర్ట్‌ అయ్యింది. ఇప్పుడు అధికారులు కుక్కల కోసం పరుగులు పెడుతున్నారు. గల్లీ గల్లీ లో వెళ్లి వీధికుక్కలను బంధిస్తూ తరలిస్తున్నారు. ఎక్కడ వీధి కుక్కలు కనపడినా పరుగులు పెడుతూ వాటిని బంధిస్తున్నారు. అయితే జీహెచ్‌ ఎంసీ చేస్తున్న పనికి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే పని ఇంతకుముందే చేసి ఉంటే.. అంబర్ పేటలో చిన్నారి ప్రాణాలు దక్కేవే అంటున్నారు. అంతా అయిపోయాక.. ఇప్పుడు ఏం చేసి ఏం లాభం అని కొందరు విమర్శిస్తుంటే.. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచారని మరికొందరు అంటున్నారు. ఎట్టకేలకు జీహెచ్‌ ఎంసీ ఇప్పటికైనా స్పందించిందని అంటున్నారు. ఇదేమని ముందే చేసి ఉంటే ఇప్పటి వరకు కుక్కల దాడికి బలైన వారి సంఖ్య ఉండేది కాదని చెబుతున్నారు.
Minister Harish rao: సిద్దిపేటలో రైలు కూత వినిపించాలని.. అధికారులకు మంత్రి ఆదేశం