NTV Telugu Site icon

MLA Rasamayi Balakishan: అభివృద్ధి చేయని ఎమ్మల్యే మాకొద్దు.. రాజీనామా చేయాల్సిందే..

Rasamai Balakishan

Rasamai Balakishan

MLA Rasamayi Balakishan. కరీంనగర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కు నిరసన సెగ ఎదురైంది. గన్నేరువరం మండలంలో పర్యటిస్తున్న రసయిని యువకులు అడ్డుకున్నారు. నియోజక వర్గ అభివృద్ధిపై యువకులు ప్రశ్నించారు. గుండపల్లి నుంచి గన్నేరువరం వరకు రోడ్డు అధ్వాన్నంగా ఉంటే పట్టించుకోవడం లేదని నిలదీశారు. నియోజకవర్గంలో దళితబంధు పథకం ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయని మీరు రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని బాలకిషన్ తో వాగ్వాదానికి దిగారు యువకులు.

Read also: Kenya drought: కెన్యాలో కరువు తాండవం..వేలాదిగా చనిపోతున్న వన్యప్రాణులు

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తుస్తూ ఎమ్మెల్యే రసమయిని అడ్డుకున్నారు. అభివృద్ధి చేయని ఎమ్మెల్యే మాకొద్దంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మునుగోడులో అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం ఏంటని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. డబుల్ రోడ్డు నిర్మాణం గురించి వాట్సాప్‌ గ్రూప్‌ లలో ఇన్ఫర్మేషన్‌ ను షేర్‌ చేసిన నాగరాజు అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సీఈసీ వికాస్ రాజ్ కు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన రూ.2 కోట్ల నిధులను మునుగోడులో ఖర్చు చేసి అభివృద్ధి చేస్తానంటూ రసమయి ఇచ్చిన హామీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఫలితాలు లైవ్‌ అప్‌డేట్స్‌..