Ganja gang: మైలార్ దేవుపల్లిలో గాంజా గ్యాంగ్ వీరంగం.. కత్తులు, రాళ్లతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja gang: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో గంజాయి ముఠా రెచ్చిపోతున్నారు. గత నెల ఓ మైనర్ బాటుడిపై దాడి చేసిన ఘటన మరువకముందే మరో ఘటన మైలార్ దేవ్ పల్లిలోనే చోటుచేసుకోవడం రంగారెడ్డి ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. హైదరాబాద్ లో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. కొంతమంది యువత మత్తుకు బానిసై, అరాచకాలకు పాల్పడుతున్నా వారి యువత ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. గంజాయి సేవించి గ్యాంగ్ లుగా ఏర్పడి నానాహంగామా సృష్టిస్తూ.. మత్తులో తూగుతూ రోడ్లమీద భయాందోళనకు దిగుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆమత్తులు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
మైలార్ దేవుపల్లిలో గాంజా గ్యాంగ్ వీరంగం సృష్టించింది. మైలార్ దేవుపల్లిలోని రావుల భాస్కర్ లో బాబుల్ రెడ్డి బస్తీ కి ఆనుకొని ఉన్న బృందావన్ కాలనీ ఉంటోంది. అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుండటంతో రావుల భాస్కర్ కలుగ జేసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా 50 మంది గాంజా గ్యాంగ్ భాస్కర్ పై దాడి చేశారు. నువ్వు మాకు చెప్పేవాడివా అంటూ దాడిచేస్తున్నవారిని భాస్కర్ కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేయగా కుమారుని పై కూడా గాంజాగ్యాంగ్ విరుచుకుపండి. మూకుమ్ముడిగా దాడి చేసింది. ఈ దాడిలో రావుల భాస్కర్ కు కత్తి పోట్లు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కాలనీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏం జరుగుతుందనే బయటకు రావడంతో భయబ్రాంతులకు గురైన కాలనీ వాసులు గాంజా గ్యాంగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. 50 మంది గాంజా గ్యాంగ్ కాలనీ వాసులపై విరుచుకుపడి విచక్షణారహితంగా దాడి చేసింది. అడ్డుకోవడానికి వచ్చిన కాలనీ వాసులపై కూడా రాళ్లు విసిరడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన చేరుకుని, క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎక్కువగా గాంజాగ్యాంగ్ రంగారెడ్డి జిల్లాలోనే ఉండటం గమనార్హం. అక్కడ యువత గాంజా సేవిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికి గాంజా ఎక్కడ దొరుకుతుంది? అంటే చాలు రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో అంటారు. ఎందుకంటే అక్కడే గ్యాంగ్ వార్ లు, దాడులు, పట్టుబడిన వారందరూ గాంజా సేవించి ఉండటం. అధికారులు స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
Read also: Man Infected By Killer Plant : మొక్కల నుంచి మానవునికి వ్యాధులు
గంజాయి మత్తులో ఓ మైనర్ బాలుడిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. కిరాణా షాపులో కూర్చున్న బాధిత బాలుడిని ముఠా సభ్యులు బలవంతంగా సమీపంలోని కొండలపైకి తీసుకెళ్లారు. అంతే కాకుండా బాధితురాలి బట్టలు విప్పి డబ్బులు డిమాండ్ చేస్తూ కర్రలు, బెల్టులతో తీవ్రంగా కొట్టారు. వారి నుంచి తప్పించుకున్న బాలుడు ఇంటికి చేరుకోగా, కుటుంబ సభ్యులు తలపై గాయాలు చూసి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అబ్బు, సమీర్, మహ్మద్ సైఫ్‌లతో పాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని చంపేశామని ముఠా సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. ఇది ఇలా వుంటే..
India- Russia: భారత్‌తో మైత్రి బలోపేతం దిశగా..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!