Site icon NTV Telugu

Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు

Gangula Kamala Kar

Gangula Kamala Kar

Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా అందరూ పోరాటం చేసారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సంపద పెరిగిందని అన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. ఉమ్మడి రాజధాని విషయంలో 10 ఏండ్ల గడువుందని పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వై.ఎస్. బిడ్డ వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందని ఎద్దేవ చేశారు. పవన్ కల్యాణ్, కేఏ.పాల్ కూడా వచ్చారని మండిపడ్డారు. తెలంగాణ సంపదపై వీరంతా కన్నేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ఎంటరై పాత బిడ్డల్లారా రండి అంటున్నాడని ఆరోపించారు. డిఫరెంట్ వేషాల్లో వీళ్లంతా వచ్చినా అందరూ ఒకే తాను ముక్కలు అంటూ మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీరి ఎజెండా అంటూ నిప్పులు చెరిగారు.

Read also: MLC Kavitha: సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదల కోసమే

మళ్లీ 1956 నవంబర్ 1 గుర్తుకు తెస్తున్నారని అన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే చంద్రబాబు ఎంట్రీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మూలాలు ఎక్కడ? ఏపీ మూలాలున్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని? అంటూ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు జూన్ 2నే ఏర్పడినా చంద్రబాబు ఆరోజు ప్రమాణం చేయలేదని గుర్తు చేశారు. ఖమ్మం నుంచి ఏడు మండలాలు కలిపేదాకా ప్రమాణం చేయనన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపించారు. సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరి వెనక బీజేపీ ఉందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును పగలగొట్టి మళ్లీ తెలంగాణను ఎడారి చేయాలనుకుంటున్నారని తెలిపారు. మన రాష్ట్ర సంపదపై కన్నేసి వస్తున్నారని ఆరోపించారు. హైద్రాబాద్ సంపదను, మన నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో భాగమే ఇదంతా అన్నారు. బీఆర్ఎస్ తో మేము దేశమంతా పోతుంటే.. తెలంగాణ మీదకే వీళ్లంతా ఎందుకొస్తున్నారు? అని ప్రశ్నించారు.

Read also: Sajjala Ramakrishna Reddy: ఏం చేయాలో చంద్రబాబుకు స్పష్టతలేదు.. ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడంలేదు..!

మీది జాతీయ పార్టీనే కదా కర్ణాటకలోకో, తమిళనాడులోకో చంద్రబాబు ఎందుకు పోవడం లేదు? అంటూ ప్రశ్నించారు. మనం ఏనాడు ఏపీ సంపద దోచుకోవాలనుకోలేదు. అందుకే ఏపీలో పక్కా పోటీ చేస్తాం అన్నారు. వాళ్లు గతంలో తెలంగాణను దోచుకున్నవాళ్లు, దోచుకోవాలనుకుంటున్న వాళ్లు కాబట్టే వ్యతిరేకిస్తున్నామన్నారు. తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్లు కూడా మిమ్మల్ని నమ్మరని తెలిపారు. మద్రాసు నుంచి తన్ని తరిమేస్తే సంపద ఎక్కువగా ఉన్న తెలంగాణను ఆనాడు కలిపారన్నారు. ఇప్పుడు మళ్లీ వేర్వేరు వేషాల్లో గద్దల్లా తెలంగాణ సంపదను దోచుకునేందుకు వస్తున్నారని అన్నారు. కేసీఆర్ సత్ఫాలన చూసి దేశమంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆరోపించారు. మాకు దేశంలోని నలు మూలల నుంచి వందల ఫోన్లు వస్తున్నాయని, ఏపీలో కూడా మాకు అద్భుత మెజార్టీ వస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.
Harish Rao: “తెలంగాణ” నోట్లో “మట్టి కొట్టి”న వ్యక్తి “చంద్ర బాబు”

Exit mobile version