Gangula kamalakar: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. హజ్ యాత్రికులకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కల్యాణి గార్డెన్స్ లో ఆరోగ్య పరీక్షలు, టీకాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. యాత్రకు వెళ్లే యాత్రికులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలు హజ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారని తెలిపారు. అలాంటి పాదయాత్రకు వెళ్లే ఆర్థిక స్థోమత లేని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.
Read also: Free Petrol: ఉచితంగా పెట్రోల్.. బారులు తీరిన వాహనదారులు
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం.. ఆయన ఆరోగ్యంగా ఉండాలని సీఎం కేసీఆర్ అల్లాను ప్రార్థించాలన్నారు. అల్లా దయతో దయ్యాలను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సర్వమత వేదిక అని మంత్రి వ్యాఖ్యానించారు. అన్ని మతాల వారి సంప్రదాయాల ప్రకారం పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి కొనసాగుతుందని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. హజ్ యాత్రికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని.. ఎలాంటి సమస్య వచ్చినా 24/7 సంప్రదించవచ్చని ఆయన సూచించారు. అవసరమైతే సౌదీ అరేబియా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
Plane Door: ల్యాండింగ్ అవుతున్న విమానం ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసిన ప్రయాణికుడు.. ఏం జరిగిందంటే..?