Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- రూ. వందల కోట్ల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ముఠా
- నకిలీ జీఓలు, రెవెన్యూ రికార్డులతో భారీ కుట్ర
- హైకోర్టులో బెయిల్ తిరస్కరణ.. తమిళనాడులో అరెస్ట్
- కేసులో మరిన్ని కీలక వ్యక్తుల పాత్రపై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bolla Brahmanayudu : గండిపేట మండలంలో రూ. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన భారీ కుట్ర కేసులో ఎట్టకేలకు ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడి (Bolla Brahmanaidu)ని పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపేట తహసీల్దార్ శ్రీ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును నార్సింగి పోలీసులు , సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (EOW) పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
రూ. 12 కోట్ల ఆర్థిక లావాదేవీలు.. నకిలీ జీవోలతో కబ్జా కుట్ర
గండిపేట మండలంలోని సర్వే నెం. 18లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని, దాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు నిందితులు భారీ వ్యూహాన్ని రచించారు. అందుకోసం నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (Fake GOs), తప్పుడు రెవెన్యూ రికార్డులు , ఇతర నకిలీ అధికారిక పత్రాలను సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ దందా కోసం ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahmanaidu) ఏకంగా రూ. 12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ. 4 కోట్లు, ఇప్పటికే అరెస్టయిన నిందితుడు రాధాకృష్ణకు రూ. 4 కోట్లు, మిగిలిన రూ. 4 కోట్లను ఈ కుట్రతో సంబంధమున్న ఇతర వ్యక్తులకు చెల్లించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందుగా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, కేసులో ఉన్న ప్రాథమిక ఆధారాలు , దర్యాప్తు దశను పరిశీలించిన గౌరవ హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో పరారీలో ఉన్న బ్రహ్మనాయుడి కోసం నార్సింగి , సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో అతడిని గుర్తించి, ఈరోజు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఈ కేసులో బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ , నిమ్మల కుటుంబ సభ్యులు అందరూ కలిసి పరస్పర కుట్రతో ప్రభుత్వ భూమిపై అక్రమ హక్కులు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసులో నిమ్మల కుటుంబ సభ్యులతో పాటు రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రభీన్ కుమార్‌లను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం వీరికి పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ప్రస్తుతం అరెస్టయిన ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడిని కూడా చట్టపరమైన ప్రక్రియ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కుట్రలో ప్రభుత్వ అధికారుల పేర్లు, సంతకాలను ఎలా దుర్వినియోగం చేశారు, ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!