Site icon NTV Telugu

MLC Kavitha: గాంధీలు స్వయంగా క్షమాపణ చెప్పలేరా? కవిత ట్విట్ వైరల్

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పాపం, గాంధీ కుటుంబానికి పదేళ్లలో ఒక్కసారి కూడా వందల మంది తల్లుల కడుపు కోత గుర్తుకు రావడం లేదు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణకు ద్రోహం చేసిన గాంధీ కుటుంబం కనీసం క్షమాపణ చెప్పలేని పరిస్థితి. హామీ కోసం గాంధేయవాది, క్షమాపణ కోసం బంట్రోతులా అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘గ్యారంటీ కోసం గాంధీ, క్షమాపణ కోసం బంట్రోతులా???! ఆరు దశాబ్దాల పాటు తెలంగాణకు ద్రోహం చేసిన గాంధీ కుటుంబం కనీసం తమకు క్షమాపణ చెప్పలేదా? పదేళ్లలో ఒక్కసారైనా వందల మంది తల్లుల కడుపు కోత మీ కుటుంబం గుర్తుకు రాకపోవడం బాధాకరం! ఈ నేలపై పాదయాత్ర చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకపోవడం దారుణమన్నారు. ఈ రోజు కూడా మీకు షాహీద్ స్థూపానికి దారి తెలియకపోవడం చాలా బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలు తీరవు!’’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


Telangana Elections 2023: కాంగ్రెస్‌ కు షాక్.. కారెక్కిన కత్తి కార్తీక..

Exit mobile version