Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
- గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్
- ప్రభుత్వ డబ్బుల పేరుతో తల్లికి వల
- రూ.లక్షకు చిన్నారిని విక్రయించిన ముఠా
- గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీ ఆసుపత్రిలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపింది. అయితే పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, కేవలం గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. పసికందును కిడ్నాప్ చేసిన ముఠా సభ్యులు ఆ చిన్నారిని లక్ష రూపాయలకు విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ డీసీపీ టీమ్ ఆరుగురు నిందితులు సరగడ హేమలత,షేక్ రిజ్వాన్,మహమ్మద్ నస్రీన్, మహమ్మద్ జానీ, షేక్ షమీనా బేగం, మహమ్మద్ ఇమ్రాన్ లను అరెస్ట్ చేసింది.
మాయమాటలతో ట్రాప్.. డబ్బు ఆశ చూపి ఎత్తుకెళ్లిన ముఠా
బిహార్‌కు చెందిన ఓ మహిళ కొన్ని రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడో కాన్పులోనూ ఆడబిడ్డే పుట్టడంతో ఆ ముఠా ఆ మహిళను ట్రాప్ చేసింది. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని, తాము ఆ డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి ఏడు రోజుల పసికందును ఎత్తుకెళ్లింది. నిందితులు చిన్నారిని కిడ్నాప్ చేసి లక్ష రూపాయలకు అమ్మేశారు.
Also Read
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
- New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నేడు ఎనిమిదో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!
- Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
ప్రత్యేక బృందాలతో వేగవంతమైన గాలింపు
కిడ్నాప్ సమాచారం అందిన వెంటనే సికింద్రాబాద్ డీసీపీ రక్షితా మూర్తి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు బృందాలు వేగంగా గాలింపు చర్యలు చేపట్టి, గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. మిగిలిన కోణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి కళ్లుచెదిరే విరాళం.. ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలు..
-
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
-
Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
-
Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!