Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మల్కాజిగిరి స్థానానికి 8 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ఇక మరోవైపు ఇవాళ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు. ముందుగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేశారు.
Read also: HimachalPradesh : ఫస్ట్ టైం మొబైల్ నెట్ వర్క్ అందుకున్న గ్రామం.. గ్రామస్తులతో మాట్లాడిన మోడీ
అనంతరం ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి ఉదయం 11 గంటలకు మెహబూబ్ కళాశాలలోని వివేకానంద విగ్రహానికి నివాళులర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రసంగించనున్నారు. ఇక..నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25 కాగా.. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అయితే.. మే 13న ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు జూన్ 4న ప్రకటించి.. ఇదిలావుంటే.. 19, 23, 24 తేదీలు మంచి ముహూర్తాలు కావడంతో ఆ రోజుల్లో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
Bengaluru: కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్‌లో డబుల్ మర్డర్ కలకలం..