Site icon NTV Telugu

Bandi Sanjay: చెప్పుతో కొడితే కొట్టించుకుంటా.. తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: చెప్పుతో కొడితే కొట్టించుకుంటా.. తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికలు,పార్టీ సంస్థాగత బలోపేతం కోసం పార్టీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. అనంతం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లెక్క దేశం అభివృద్ధి చేయాలంటే ఏమి అభివృద్ధి జరిగింది తెలంగాణలో అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఎక్కడా ఇవ్వట్లేదని సవాల్ విసిరారు. రైతు ద్రోహి కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. యూరియా సబ్సిడీ ఇస్తుంది కేంద్రమే వివరాలు చెప్పాలన్నారు. రేపు నిరసనలు ఎందుకు చేస్తున్నారు కుటుంబము మీద ఆరోపణలు వస్తున్నాయని డైవర్ట్ చేసేందుకేనా? అని ప్రశ్నించారు.

Read also: Harish Rao: వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించింది

అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడుతుంది.. కేసీఆర్ కుటుంబం మోదీని బీజేపీ తిట్టడం పనిగా పెట్టుకుందన్నారు. దేశంలో ఓ ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని చర్చ జరుగుతోందని, టీఆర్‌ఎస్‌ దివాళా దీసి బీఆర్‌ఎస్‌ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బందిపోట్ల పార్టీ బీఆర్‌ఎస్‌ వచ్చిందని ఎద్దేవ చేశారు. రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది అద్భుతాలు ఏమి చేశావు? అని ప్రశ్నించారు. బిడ్డ లిక్కర్ కేసు మీద ఇంతవరకు కేసీఆర్ మాట్లాడలేదని మండిపడ్డారు. మళ్ళా కేసీఆర్ కుటుంబం గెలిస్తే తెలంగాణ ప్రజలు అంతా చిప్పలు కడగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుతో కొడితే కొట్టించుకుంటా.. తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

ఇక హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడల శ్రీనివాస్ రావు పెద్ద అవినీతి పరుడని ఆరోపించారు. ప్రజలను ఓ మతానికి చెందిన దేవుడు కాపాడట! మరి ఆ దేవుడు ఉన్న దేశానికే పో! ఎందుకు ఇక్కడ బతకడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మతానికి కొమ్ముకాసే అధికారివా? అంటూ ప్రశ్నించారు. ఒక్క హాస్పిటల్ లో సరైన సౌకర్యాలు కల్పించలేకపోయవంటూ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే టికెట్ కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావ్ అంటూ ఆరోపించారు. నీ అవినీతిని అన్ని రుజువు చెపిస్తాం అంటూ సవాస్‌ విసిరారు బండి సంజయ్‌.
Omicron BF7: కరోనా విజృంభనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

Exit mobile version