Distribution of Sheep: నేటి నుంచి గొర్రెల పంపిణీ.. మంచిర్యాలలో సీఎం, నల్లగొండలో తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Distribution of Sheep: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొల్ల, కురుమలకు 2వ దశ సబ్సిడీ గొర్రెల పంపిణీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంచిర్యాల జిల్లాలో, రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్లగొండ జిల్లా నగిరేకల్‌లో ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. కులవృత్తుల వారిని ప్రోత్సహించాలనే.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. గొర్రెల పెంపకం వృత్తిగా జీవిస్తున్న గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే తలంపుతో ప్రభుత్వం సుమారు 11 వేల కోట్ల రూపాయలతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
Read also: CM KCR: నేడు మంచిర్యాలకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే..
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
ముందుగా రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన గొల్ల, కురుమలను గుర్తించి గొర్రెల పెంపకందారుల సొసైటీల్లో సభ్యత్వం కల్పించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. వీరికి ఒక యూనిట్ గా 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉండగా ఒక్కో యూనిట్ ధర లక్షా 25 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం 75 శాతం (రూ. 93,750), లబ్ధిదారుల వాటా 25 శాతం (రూ. 31,250) చెల్లించాలి. మొదటి దశలో రూ.5 కోట్లతో 3 లక్షల 93 వేల 552 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ వాటా నిధులు 3 వేల 751 కోట్ల రూపాయలు కాగా, లబ్ధిదారుల వాటా 1,250 కోట్ల రూపాయలు. గొర్రెల ధర పెరగడంతో 2వ దశలో యూనిట్ ధర రూ. ఇందులో ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వ వాటా మూలధనం లక్షా 31 వేల 250 రూపాయలు కాగా, లబ్ధిదారుడి వాటా 43,750 రూపాయలు. నేటి నుంచి 2వ దశలో 3 లక్షల 37 వేల 816 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 6085 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా రూ.4,563.75 కోట్లు కాగా, లబ్ధిదారుల వాటా రూ.1521.25 కోట్లు. లబ్ధిదారులకు గొర్రెల బీమా సౌకర్యంతోపాటు గొర్రెల యూనిట్‌ను అందజేస్తామన్నారు. ఒక గొర్రె చనిపోతే మరో గొర్రెను కొనుగోలు చేసి బీమా క్లెయిమ్‌గా ఇస్తారు. దీంతోపాటు గొర్రెలను కొనుగోలు చేసిన ప్రాంతం నుంచి లబ్ధిదారుల ఇంటికి చేర్చేందుకు అవసరమైన మందులు, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
Railway Income: రైల్వేకు శుభవార్త.. ఒక్క నెలలోనే రూ. 14,642 కోట్లు
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!