Adilabad and Nizamabad: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పొగమంచు కమ్మేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కశ్మీరాన్ని తలపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచే దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో రహదారిపై లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. చలికి వణుకుతూనే పనులకు వెళుతున్నారు. మూడు రోజుల నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో దుబ్బపటి కప్పుకున్న వణుకుడు మాత్రం ఆగడం లేదు. జిల్లాల్లో ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో కశ్మీరాన్ని తలపిస్తుంది. ఉదయం రహదారుల్లో నడవాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎదుటి వాహనాలు కూడా మంచులో కనిపించకపోవడంతో రహదారుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంంటున్నారు.
Read also: Prabhas: పాన్ ఇండియా హీరోకి అదిరిపోయే విలన్ కటౌట్…
జిల్లాలకు కమ్మేసిన పొగమంచు..
ఆదిలాబాద్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. రహదారి పై తీవ్రమైన మంచుతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టంగా మంచు ఆవరించినడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పొగమంచు కమ్మేసింది. రోడ్లపై దట్టంగా పొగ మంచు అలుముకుని ఉండటంతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ రోడ్డు, బై పాస్ రహదారి తో పాటు ప్రధాన రోడ్ల లో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాని పొగమంచు కమ్మేసింది. రోడ్లపై దట్టంగా పొగమంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనుచూపు మేరలో వాహనాలు కనిపించడం లేదు. దీంతో రహదారిపై ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారింది. కాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. హనుమకొండ,కాలేశ్వరం 353 జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. లక్ష్మారెడ్డి పల్లి,మొరంచపల్లి ప్రధాన రహదారి పూర్తిగా పొగ మంచు కమ్మేసింది. వాహనచోదకులు దగ్గరికి వచ్చే వరకు ఒక వాహనానికి మరో వాహనం కనబడకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులు వాపోతున్నారు.
Mahua Moitra: నేడు లోక్ సభ ముందుకు మహువా మొయిత్రా సస్పెన్షన్ నివేదిక..!