Site icon NTV Telugu

Modi Hyd Tour : మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు..

Modi flexi

Modi

బీజేపీ టీఆర్ఎస్‌ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లోని ఇండియస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫెక్సీలు వెలిశాయి. హైదరాబాద్‌ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదనేది ఈ ఫ్లెక్సీలలోని సారాంశం.

ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఐఎస్‌బీని ఎస్పీజీ ఇప్పటికే ఆధీనంలో తీసుకుంది. దీంతో పాటు ప్రధాని రానున్న బేగంపేట ఎయిర్‌పోర్టు కూడా ఎస్పీజీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా.. ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న విద్యార్థుల బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు వారికి సంబంధించిన సోషల్‌ మీడియా అకౌంట్లలో మోడీకి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు ఉన్నాయోనని పరీశీలించారు అధికారు. ఏమైనా వ్యతిరేకంగా ఉంటే.. ఐఎస్‌బీలోకి అనుమతిని నిరాకరించనున్నారు.

Exit mobile version