బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లోని ఇండియస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు ఎందుకు…