Hit and Run Case: హిట్ అంట్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే రుత్విక్‌రెడ్డికి అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది. తాను పనిచేసే స్థలాన్ని చూపిస్తానంటూ ఫ్రెండ్స్‌ను రుత్విక్‌రెడ్డి తీసుకెళ్లిన ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌లో మద్యం సేవించారు. ఇక ఉదయం 4 గంటల సమయంలో ఫ్రెండ్స్‌కు ఆఫీస్ చూయించిన రుత్విక్.. ఆ తర్వాత మాదాపూర్‌లో బిర్యానీ తిన్నారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో పెద్దమ్మ గుడి సమీపంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. అయితే ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే..
అసలు ఏం జరిగింది..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. పెద్దమ్మ గుడి వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు 27 ఏళ్ల తారక్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు తారక్ మృతి చెందింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొన్న వేగానికి బైక్ దాదాపు 20 అడుగుల మేర కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తారక్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత బౌన్సర్‌గా తన వృత్తిని ఎంచుకున్నాడు. తారక్‌కు ఏడాదిన్నర క్రితం వివాహం కాగా, 11 నెలల కుమారుడు ఉన్నాడు. కుటుంబానికి అండగా ఉన్న తారక్ ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది.
Devara : సినిమాకే హైలెట్ గా నిలవనున్న ఆ కీలక ట్విస్ట్..?