Site icon NTV Telugu

Fire : సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం.. కారులో మంటలు

Vem Narendar

Vem Narendar

Fire : మహబూబాబాద్‌ జిల్లా సొమ్లా తండాలో మంగళవారం ఉదయం ఒక దుర్ఘటన భయాందోళన కలిగించింది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హేలీప్యాడ్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. వాహనం పూర్తిగా దగ్ధం కాకముందే మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Regina Cassandra : ‘నా తల్లే అడగడం లేదు.. మీకు ఎందుకు’- రెజీనా ఫైర్ !

వాహనంలో విద్యుత్ లైన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారుడిగా పనిచేస్తున్న వేం నరేందర్ రెడ్డికి ఎలాంటి గాయాలు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపినప్పటికీ, సత్వర స్పందన వల్ల భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Deputy CM Pawan Kalyan: ప్రసన్నకుమార్‌ రెడ్డి వ్యాఖ్యలపై స్పదించిన పవన్‌ కల్యాణ్‌.. చట్ట ప్రకారం చర్యలు..!

Exit mobile version