Fire : మహబూబాబాద్ జిల్లా సొమ్లా తండాలో మంగళవారం ఉదయం ఒక దుర్ఘటన భయాందోళన కలిగించింది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హేలీప్యాడ్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. వాహనం పూర్తిగా దగ్ధం కాకముందే…