Yadadri : రైలులో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. నిన్న అర్ధరాత్రి దాటాక పగిడిపల్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే చివరి బోగిలో మంటలు అంటుకున్నాయి. అది లగేజీ భోగిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేసారు.
అయితే.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణీకులు రైలు ఆగగానే కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో ఘటనపై సమాచారం అందగానే సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు రప్పించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో లగేజీ బోగీలో స్వల్ప ఆస్తినష్టం జరిగినట్లు గుర్తించారు. రైలులో మంటలు చెలరేగిన సమయంలో రైలు ఆగకుండా వెళ్తే పెనుప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
LIVE: ఆదివారం నాడు భక్తి శ్రద్ధలతో శ్రీసూర్య స్తోత్ర పారాయణం చేస్తే..?
తాజావార్తలు
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!