TS Assembly Sessions: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్.. ఈసారి హరీష్ లెక్క ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Assembly Sessions: ఇవాళ అసెంబ్లీలో 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయాన్ని హరీష్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటాయింపులపై చర్చ జరగనుంది. ఈ ఏడాది 12వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశముంది. అయితే.. ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, ముందస్తు ఎన్నికలు రావొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎన్నికల ఏడాదిలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకానికి భారీగా కేటాయింపులు ఉండే అవకాశముందని తెలుస్తోంది. అలాగే మిగతా సంక్షేమ పథకాలను కూడా భారీగా నిధుల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అయితే.. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పొందుపర్చింది.
Read also: Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
సీఎం కేసీఆర్ రెండో దఫా పాలనకు నాలుగేళ్లు పూర్తై, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తుండగా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం అమలు చేయలేదు. ఇక, నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చి దానిని అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారనే విమర్శలు ప్రతిపక్ష, విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య భారీగా ఉందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే యువత ఓట్లు కీలకం. ఈనేపథ్యంలో.. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి ఆ హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్ష ఇస్తామని గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు. సీఎం కేసీఆర్ గతంలో అనేకసార్లు ప్రకటనలు చేసినా ఇప్పటివరకు ఆ పథకానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇవాళ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆ పథకానికి నిధులు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. అంతేకాకుండా.. వైద్య రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు.
Monday Shiva Stothra parayanam Live: సోమవారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు