NTV Telugu Site icon

వరంగల్‌ ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత..రైతులతో కొలిక్కి రాని చర్చలు

వరంగల్ రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల మోసంపై ఆగ్రహం వ్యక్తం చేవారు. దీంతో ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఏనుమాముల మార్కెట్లో ఉదయం మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు తేజ మిర్చికి రూ.17,200గా ధర నిర్ణయించారు. అనంతరం రూ.14 వేలలోపు ధరలు నిర్ణయిస్తూ కొనుగోళ్లకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఒక కాంటను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాధేయపడగా.. రైతులు శాంతించారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

Read Also: హైకోర్టుకు హాజరు కాని ఉద్యోగ సంఘాల నేతలు

రైతులకు న్యాయం చేయాలని కోరారు.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతుల ఆందోళన విరమింపజేశారు. తర్వాత వారితో చర్చలు జరిపారు. కానీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులు కాంటాలను అడ్డుకున్నారు. డీసీఎం వ్యాన్‌ అద్దాలు పగలకొట్టారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గిట్టుబాటు ధర వచ్చేవరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు శాంతింప జేసిన రైతులు మాత్రం తమ ఆందోళనలు విరమించడం లేదు.