Rajanna Sircilla: ఉద్యోగాల పేరుతో ప్రకటన.. కోట్లు కొట్టేసిన కేటుగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు మోసగాళ్లు వివిధ మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా.. ఉద్యోగాల పేరుతో ఓ కేటుగాడు భారీ మోసానికి తెరతీశాడు. దేశవ్యాప్తంగా 1300 మందిని రూ. 1.6 కోట్లు కొల్లగొట్టాడు. ఇలాంటి ఘటనే రాజన్న సిరిసిల్లలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగాల పేరుతో నకిలీ ప్రకటనలు ఇస్తున్నాడు. ఆయుష్మాన్ భారత్ కింద ఆశా వర్కర్ ఉద్యోగాల కోసం పేపర్‌లో ప్రకటనలు వచ్చాయి. అది నమ్మిన రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ మహిళ అతడిని సంప్రదించింది. ఉద్యోగం రావాలంటే కొంత డబ్బు చెల్లించాలని నమ్మించాడు. బాధితుడు నమ్మి రూ. 3 లక్షలు ఖాతా ద్వారా బదిలీ చేశారు. ఆ తర్వాత నిందితుడు పంపిన లింక్‌పై రెజ్యూమ్‌ను షేర్ చేయాలని కోరాడు. ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ ఐడీలతో ఆమెకు ఈ మెయిల్స్ పంపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు రామ్‌ప్రసాద్‌ను అరెస్టు చేశారు. అతడికి సిమ్ కార్డులు అందించిన మరో నిందితుడు రామ్‌కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసి రామ్ ప్రసాద్ ఇప్పటి వరకు 1.6 కోట్లు దోచుకున్నాడని జిల్లా ఎస్పీ తెలిపారు. అతనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 65 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహాజన్ సూచించారు. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు.
Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్ హెడ్‌తో బోగస్ సిఫార్స్ లేఖ
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!