Extreme Cold in Telangana: తెలంగాణపై చలి పంజా.. జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extreme Cold in Telangana: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలికి పులి పంజా విసరడంతో జనం వణికిపోతున్నారు. మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతో పాటు గాలిలో తేమశాతం పెరగడంతో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తోందన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పట్టణాలు, పల్లెల్లో రోడ్లన్నీ దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలకు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు. అయితే.. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read also: Catherine Tresa : కైపెక్కిస్తున్న చూపులతో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, మల్కాజిగిరి జిల్లాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ వాయువ్య దిశలో కొంత వేడి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్, మధ్య తెలంగాణలో కొంత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరుగుతోందని.. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ఆస్తమాతో పాటు కొన్ని శ్వాసకోశ సమస్యలు వస్తాయని తెలిపారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరిస్తున్నారు.
Catherine Tresa : కైపెక్కిస్తున్న చూపులతో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?