Ponguleti Srinivasa Reddy: రాబోయే రాజకీయ చందరంగం కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దంగా ఉన్నానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవంతుడి దయతో నా మీద ఉన్న మీ ప్రేమ వట్టిగా పోదు ప్రజలు ఏం కురుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తాను అని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కామెంట్లు ప్రాధన్యత సంతరించుకుంది. ఖమ్మం నగరంలోని ఒక కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనని ప్రజలు కోరుకుంటున్నారని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి లో శ్రీనివాసరెడ్డి పేరు అభిమానంతో ఉన్నదని వారి కోరిక మేరకు వారు ఆశించినట్లుగా తాను భవిష్యత్తులో రాజకీయ చదరంగానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.
Read also: Top Headlines @1PM: టాప్ న్యూస్
రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలని కోరుకుంటారని ప్రజల అభిమానం మేరకు ప్రజలతో మమేకమై ఉన్నవాడే రాజకీయ నాయకుడిగా రాణించగలుగుతాడని పొంగులేటి అన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పరిణామాలు జరుగుతాయని అన్నాడు.పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాననీ,చిన్న చిన్న వ్యాపారాలు చేసి దిన దిన అభివృద్ధి జరిగి ఆ భవవంతుడి దయతో ఆర్ధికంగా నిలదొక్కుకున్నని అన్నాడు. జగనన్న ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చానని, రాజకీయలోకి వచ్చిన 13 నెలలోనే ప్రజల అభిమానం పొంది ఎంపి అయ్యానన్నారు. పార్లమెంటు సభ్యుడిని అని గర్వంగా లేకుండా ఎప్పుడూ మీ తోనే కలిసి మమైకం అయి ఉన్నానని, గడిచిన నాలుగు సంవత్సరాలల్లో ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో మీ అందరికి తెలుసు. అధికారం పదవి ఉన్న లేకపోయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతానికి వెళ్ళిన అదే ప్రేమతో నన్ను అదిరించారని తెలిపారు.
Read also: Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ పై ముగిసిన సమావేశం.. 11న రైతు జే.ఏ.సి. ధర్నా
చిన్న చిన్న వ్యాపారాలు చేసి దిన దిన అభివృద్ధి జరిగి ఆ సిభవవంతుడి దయతో ఆర్ధికంగా నిలదొక్కుకున్నాని అన్నారు. అధికారం పదవి ఉన్న లేకపోయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతానికి వెళ్ళిన అదే ప్రేమతో నన్ను అదిరించారని తెలిపారు పొంగులేటి. అయితే.. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో యుద్దానికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. కాగా.. గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరం అవుతున్నారనే ప్రచారం సాగుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా.. ఆత్మీయ సమావేశం నిర్వహించిన పొంగులేటి ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచురులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. ఇక మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Sreeleela: వామ్మో శ్రీలీల ఇంతమంది హీరోలతో సినిమాలు చేస్తోందా..!