తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి షాక్ తగిలినట్టు అయ్యింది.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో కొత్త జోష్ వచ్చిందని కొందరు నేతలు చెబుతున్నమాట.. ఇక, భారీ ఎత్తున పార్టీలోకి వలసలు ఉంటాయని కూడా ప్రచారం జరిగింది. కానీ, రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న మల్కాజ్‌గిరి పార్టీమెంట్ స్థానం పరిధిలోనే పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్.. పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మెయిల్, ఫాక్స్ ద్వారా పంపించిన ఆయన.. ఇక, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కూడా పంపించారు.
కాగా, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పార్టీలోని జోష్ వచ్చినా.. ఆయనకు సీనియర్లు సహకరించడంలేదనే విమర్శలు ఉన్నాయి.. అక్కడక్కడ కొందరు నేతలు బహిరంగంగానే ఈ విషయాన్ని ప్రకటించారు.. కొందరు మాత్రం తమ అసంతృప్తిని బయటకు చెప్పకపోయినా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు.. మరోవైపు, అంతా హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో.. ఆకుల రాజేందర్ రాజీనామా చేసి.. షాకిచ్చారు.
