Site icon NTV Telugu

Big Breaking: బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ సీఎం గుడ్ బై..

Rajayya

Rajayya

Big Breaking: బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నెల 10న కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు గులాబీ దళపతి టికెట్‌ నిరాకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజయ్య కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా బరిలో దిగుతానని తాటికొండ రాజయ్య అడిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందించకపోవడంతో రాజీనామా చేసినట్లు సమాచారం. . మరి దీనిపై కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తారు? వరంగల్ టికెట్ ఇస్తారా? అనే దానిపై ఆశక్తి నెలకొంది.

Read also: Kumari Aunty: కుమారి ఆంటీపై DJ సాంగ్ వైరల్..! అదిరిపోయింది!

తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. అభివృద్ధిపై చర్చించేందుకే సీఎంను కలిశామని చెబుతున్నా… వీరి భేటీ పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే.. ఆయన రాజీనామాతో వరంగల్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు..

Exit mobile version