NTV Telugu Site icon

K. A. Paul: అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.. 50వేల మెజార్టీ ఖాయం!

K. A. Paul

K. A. Paul

K. A. Paul: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెంచిన మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది.. ఈ నెల 6వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియగా.. ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్.. 93.13 శాతం నమోదైంది. మొత్తం ఓట్లు 2,41,805, పోలైన ఓట్లు 2,25,192.. పోలైన పోస్టల్ ఓట్లు 686 ఉన్నాయి. అయితే కే.ఏ.పాల్‌ మునుగోడు ఉపఎన్నికల్లో తన విజయం ఖాయమని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.1.05 లక్షల మంది యువత తనకే ఓటేశారని.. కనీసం 50వేల మెజార్టీతో గెలవడం పక్కా అని పోలింగ్ ముగిసిన తర్వాత తెలిపారు. అందరూ తనకు కంగ్రాట్స్ చెబుతున్నారని.. కేసీఆర్ ఎంత అవినీతి చేసినప్పటికీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని తెలిపారు. 2 రోజులు ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను కాపాడుకుందామని యువతకు పిలుపునిచ్చారు.

Read also: Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

చౌటుప్పల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని స్వతంత్ర అభ్యర్థి కే.ఏ.పాల్‌ సందర్శించారు. పరుగులు పెడుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. నేను బిజీగా వున్నాను. మీతో మాట్లాడలేక పోతున్నందుకు క్షమించండి సాయంత్రం ఆరు గంటల తరువాత మాట్లాడుతానంటూ పరుగులు పెట్టారు. నాతో సెల్ఫీలకు నాదగ్గరకు రాకండి ఇప్పుడు సెల్ఫీలుదిగే టైమ్‌ కాదంటూ చెప్పారు. మునుగోడు నియోజక వర్గంలో భారీగా డబ్బులు పట్టుపడుతున్నా వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు కే.ఏ.పాల్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా చేయాలని డిమాండ్‌ చేశారు. మునుగోడులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కేఏ పాల్ చేతి వేళ్లన్నింటికీ ఉంగరాలు ధరించి రాగా.. ‘మీది ఉంగరం గుర్తు. చేతికి ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్లోకి రావడం రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదా?’ అని రిపోర్టర్లు ప్రశ్నించారు. ‘TRS వాళ్లు బయట కార్లలో తిరుగుతున్నారు. వాళ్లు కార్లలో రాకుండా సైకిళ్ల మీద వస్తారా?’ అని పాల్ సమాధానమిచ్చి అందరికి షాక్‌ ఇచ్చారు. అనంతరం ఇంకో బూత్ చూడాలని చెబుతూ పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు పాల్.
PVN Madhav: తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటి?