NTV Telugu Site icon

Etela Rajender: నేడే మూడు నియోజకవర్గాల్లో ఈటల పర్యటన.. వివరాలు ఇవే..

Etala Rajender

Etala Rajender

Etela Rajender: ఇవాళ బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడు నియోజక వర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దూలపల్లి, కొంపల్లి మున్సిపాలిటీ పర్యటించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు చంద్రగిరి కాలనీ, గాజుల రామరాం డివిజన్ లో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 02 గంటలకు మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్, శామీర్ పేట మండలంలో ప్రచారం చేయనున్నారు. ఇక సాయంత్రం 05 గంటలకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రచారంతో ఈటల రాజేందర్ ఇవాల్టి ప్రచారం ముగుస్తుంది.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ నిన్న వర్గల్‌ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్గల్‌ మండలంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ మరోసారి గెలిస్తే గుడి భూములను కూడా అమ్మేస్తానన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తానన్నారు. యాబై, ఈటల మాట్లాడుతూ అరవై ఏళ్ల క్రితం గ్రామాల్లో అప్పటి ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్ప కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి కూడా కేసీఆర్ వ్యతిరేకి అని ఈటల ఆరోపించారు. మళ్లీ కేసీఆర్‌కు ఓటేస్తే గ్రామాలు వదిలి వెళ్లరని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. కేసీఆర్ అర్ధాకలితో ఉంటే తప్ప అభివృద్ధి లేదన్నారు. కేసీఆర్‌ను చూసి ప్రజలు అసూయపడుతున్నారని అన్నారు. కొత్త రాకగా ఆయనకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఓటర్లకు భయపడి విడతల వారీగా మద్యం డబ్బులను కేసీఆర్ పంపిణీ చేస్తారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
Minister KTR: నేడు మంచిర్యాలలో మంత్రి కేటీఆర్ పర్యటన

Show comments