NTV Telugu Site icon

Assembly premises: అసెంబ్లీ ఆవరణలో ఈటెల, వీహెచ్.. వాటిపై చర్చ

Vh, Etala

Vh, Etala

Assembly premises: అసెంబ్లీ సిఎల్పీ ఆఫీస్ ముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యాలయం ముందు ఇరువురు నేతలు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల,కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకొన్నారు. తరచూ సంచలన ఆరోపణలు చేసుకునే ఇరు పార్టీలకు చెందిన నేతలిద్దరూ సంభాషించుకోవడం ఆసక్తికరంగా మారింది. పంజాగుట్టలో అంబేద్కర్ ఏర్పాటుపై సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వీహెచ్, ఈటెల ను కోరారు. అసలు ఆ చర్చ వస్తదా? అని ఈటెల అనుమానం వ్యక్తం చేశారు. సభ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తోందని, ప్రజల సమస్యలు మాట్లాడొద్దని ఈటెల అన్నారు. స్క్రిప్ట్ కాదని మాట్లాడితే మైక్ కట్ అవుతుందని తెలిపారు. శాసనసభ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తీరు నడుస్తోందని తెలిపారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా సభ నడుస్తోందని పేర్కొన్నారు.

Read also: CM KCR: పోడు భూములపై సీఎం కీలక వ్యాఖ్యలు

BAC మీటింగ్ కు పిలవలేదు అంటే ఐదుగురు ఎమ్మెల్యేలు అన్నారు.. మరి రూమ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో సభ సాంప్రదాయం ప్రకారం నడిచేదని అన్నారు ఈటెల. మీ రోజులు కావు ఇవి… మాకు ఒక రూమే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్‌. సభ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లా ఉందని అన్నారు. వాల్ల భాషలో మాట్లాడితేనే.. మాట్లాడిస్తున్నారని తెలిపారు. రూమ్ కోసం 6 సార్లు స్పీకర్ ను కలిసాం అయినా ఇవ్వడం లేదు.. రూమ్ లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఓక్క ఎమ్మెల్యే ఉన్నా రూమ్ ఇచ్చారని తెలిపారు.
Bandi sanjay: సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్‌లను కూల్చివేస్తాం.. బండిసంజయ్‌ సంచలన వ్యాఖ్యలు..