Site icon NTV Telugu

నన్ను ఓడించడానికి ప్రయత్నాలు.. మీకు గుణపాఠం చెబుతా..

Etela Rajender

Etela Rajender

నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ, మీకు కూడా గుణపాఠం చెబుతా అంటూ టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పర్యటిస్తూ.. రానున్న ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.. వరుసగా ఆరు సార్లు విజయం సాధించా.. ఈసారి హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురవేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మా బీజేపీ నేతలు వచ్చి హుజురాబాద్‌లో పార్టీని బలోపేతం చేశారన్నారు ఈటల.. హుజురాబాద్ 5 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పర్యటిస్తూ.. ఇష్టారీతిగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుల సంఘాలు, మహిళా సంఘాలను, వివిధ సంఘాలను పిలిపించుకుని బెదిరిస్తున్నారని ఆరోపించారు.. కాంట్రాక్టర్లును, సర్పంచ్ లను టీఆర్ఎస్‌ నేతలు బెదిరిస్తున్నారని విమర్శించారు.. నన్ను ఓడ గొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. మీకు కూడా గుణపాఠం చెబుతా అని హెచ్చరించారు ఈటల.. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ప్రజలందరూ నాకు సహకరిస్తున్నారని తెలిపారాయన.

Exit mobile version