Etela Rajender: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇళ్ళందకుంట మండలాల్లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్ట్లు పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, ఆంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగి న బాధితుల పరమార్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువైందన్నారు. బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని మండిపడ్డారు. పరిహారం మాత్రం దిక్కు లేదని అన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేలు ఆందజేయాలని తెలిపారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయని అన్నారు. వ్యవసాయ భూములు తాటి చెట్టు అంత లోతు గొయ్యి పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని, చేతల్లో మాత్రం ఏమి చెయ్యరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Warangal: విషాదం.. వరదల బీభత్సంతో 21 మంది మృతి.. ఏడుగురు గల్లంతు
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాయి. రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. చెరువులు ఏరులై పారాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి వరద ప్రవాహానికి వాగుల్లో కొట్టుకుపోయి పలువురు మృతి చెందిన సంఘటనలు రాష్ట్రంలో అనేకం. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్ల సాయంతో బాధితులను రక్షించాయి. అక్కడక్కడా చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో రహదారులు మూసుకుపోయాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేతో పాటు రాష్ట్రంలోని పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వాహనాల్లో ప్రయాణించడం కష్టంగా మారింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా జనజీవనం సాధారణ స్థితికి రావడానికి మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఆగస్టు రెండో వారం నుంచి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే ఇప్పట్లో వరదలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది.
Bhadrachalam: గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ