NTV Telugu Site icon

Etela Rajender: మల్లారెడ్డిపై దాడి రైతులకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత

Etela 1

Etela 1

మంత్రి మల్లారెడ్డిపై దాడి, వ్యక్తిగత దాడి కాదని.. ప్రభుత్వంపై  రైతులకు  ఉన్న వ్యతిరేఖత అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను పిలవకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ గెలవలేకనే పీకేను అరువు తెచ్చుకున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు.

కేసీఆర్ రైతులకు రుణాలు మాఫీ చేయకుండా డీఫాల్టర్ గా మారారని విమర్శలు చేశారు. కేసీఆర్ కు పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని.. ఖజానాపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన అహంకారానికి అద్దపడుతోందని అన్నారు. ఆయన ఆ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు. కులం పునాదులపై ఏ పార్టీ సాగదని అన్నారు. విమర్శలు చేస్తే పోలీసులు వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రెడ్డి ఘర్జణ యాత్రలో పాల్గొన్న సమయంలో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై దాడికి కాంగ్రెస్ కారణం అని, దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై 16 మందిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

 

 

 

Show comments