Site icon NTV Telugu

Telangana BJP: ఢిల్లీకి ఈటెల, డీకే అరుణ.. పార్టీలో చేరేవారి జాబితాతో అధిష్టానం వద్దకు..

Telangana Bjp

Telangana Bjp

భారతీయ జనతా పార్టీ తెలంగాణ పెద్దలు ఢిల్లీ బాట పట్టారు.. సీనియర్‌ నేత డీకే అరుణతో పాటు.. కీలక నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. హస్తిన వెళ్లారు.. తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన అధిష్టానం.. వచ్చే ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా ప్లాన్‌ చేస్తోంది.. అందులో భాగంగా.. భారీ ఎత్తున చేరికలు రంగం సిద్ధం చేసింది.. ఢిల్లీ వెళ్లిన డీకే అరుణ, ఈటెల.. పార్టీలో చేరేవారి జాబితాను తీసుకెళ్లారు.. ఇక, ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు మరో నేత కె. లక్ష్మణ్‌.. వీరంతా కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఎస్‌ సంతోష్‌తో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో ముఖ్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు.. రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరికతో పాటు.. ఆయన రాజీనామా చేస్తే.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న మునుగోడు ఉప ఎన్నికపై కూడా చర్చించనున్నారు.

Read Also: Salman Khan: గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు తుపాకీ లైసెన్స్

మొత్తంగా బీజేపీ చేరికలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది బీజేపీ తెలంగాణ నాయకత్వం.. ఇప్పటికే పార్టీలో చేరేందుకు సిద్ధమైనవారితో చర్చించి.. చేరికల కమిటీ ఓ జాబితాను తయారు చేసింది.. వారి చేరికకు ఉన్న అభ్యంతరాలను కూడా నివేదికలో పొందుపర్చినట్టుగా తెలుస్తోంది.. బీజేపీ చేరేందుకు సిద్ధమైన వారి జాబితాకు గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకునేందుకు సిద్ధం అయ్యింది బీజేపీ చేరికల కమిటీ… ఇవాళ జరిగే భేటీలో ఎవరెవరిని పార్టీలోకి తీసుకోవాలన్న విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, బీజేపీ అగ్రనేతలతో జరిగే సమావేశంలో వచ్చువల్‌గా పాల్గొననున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. మొత్తంగా ఈ భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విషయంలో ఓ నిర్ణయానికి రానున్నారు కమలం పార్టీ నేతలు.. కాగా, బీజేపీలో చేరేందుకు సిద్ధమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.. బీజేపీలో చేరేందుకు రాజీనామా కండీషన్‌ ఉండడంతో.. క్షేత్రస్థాయిలో పర్యటించి దానిపై నిర్ణయం తీసుకోనున్నారు రాజగోపాల్‌రెడ్డి.

Exit mobile version