NTV Telugu Site icon

Etela Rajender: నేనేలా బాధ్యుడిని.. నాకు సంబంధం లేదు..

Etela Rajender

Etela Rajender

Etela Rajender: తెలంగాణలో త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారనున్నాడు.. బండి సంజయ్‌ని మార్చేసి.. ఆయన స్థానంలో ఈటల రాజేందర్‌ను అధ్యక్షుడిగా నియమిస్తారు..! ఇలా పెద్ద ప్రచారమే జరుగుతోంది.. సోషల్‌ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లోనే ఈ చర్చ సాగుతూ వచ్చింది.. అయితే, ఇవాళ హైదరాబాద్‌ మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్‌.. ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని జరుగుతున్న ప్రచారానికి నేనేలా బాధ్యుడిని అని ప్రశ్నించారు.. అసలు నాకు సంబంధం లేదని తేల్చేశారు.. తెలంగాణ ప్రజలు నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని తెలిపారు ఈటల రాజేందర్.. ఇక, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వారు డబ్బులు లేని వారు రాజకీయాల్లో ఉండకూడదా? అని ప్రశ్నించారు.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన డబ్బులు పంపిస్తున్నారు? అని బీఆర్ఎస్‌పై ఆరోపణలు గుప్పించిన ఆయన.. ఇక్కడి గవర్నర్ ను పిలవరు.. కానీ, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను సచివాలయ ప్రారంభోత్సవానికి పిలుస్తారని మండిపడ్డారు.. డబ్బులిచ్చి డప్పు కొట్టించుకోవడం తప్ప మరోటి కాదు అని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్..

Read Also: Minister KTR: అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కేటీఆర్‌ సమీక్ష.. అవసరమైతే చట్టాలను మార్చాలి..

చంద్రబాబుకి పట్టిన గతే కేసీఆర్‌కు తగులుందని హెచ్చరించారు ఈటల.. కరోనా కారణంగా పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడంలేదు.. రాజ్ భవన్ లో నిర్వహించుకోవాలని లేఖ రాయడం సిగ్గు చేటు అని మండిపడ్డ ఆయన.. రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమాన పరిచారు.. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభంకావడం ఆనవాయితీ.. కానీ, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే కొనసాగుతాయని లీక్ చేయడం కేసీఆర్ రాచరిక పోకడకు నిదర్శనమని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి కూడా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించలేదు.. కేసీఆర్.. బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి పిలవకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. పార్టీల మధ్య ఇనుప గోడలు కట్టారు.. ఇతర పార్టీల నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేకుండా చేశారన్నారు..

ఎన్నికల ప్రక్రియ మొత్తం డబ్బుతో ముడిపెట్టి అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును డబ్బుతో కొంటున్నారు అని ఆరోపించారు ఈటల.. కేసీఆర్ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారన్న ఆయన.. రాష్ట్రంలోని 119ఎమ్మెల్యేల్లో 105 మంది ఓకే పార్టీలో ఉండేలా చేశారంటే పరిస్థితి అర్థమవుతుందన్నారు.. హైదరాబాద్ లో ఉన్న భూములను ఆక్రమించుకుని, అమ్ముకుని నార్త్, ఈస్ట్ రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని.. ఈ రోజు డబ్బులు లేకుంటే ఎన్నికలు లేవు.. సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి లేకుండా చేస్తున్నారన్నారు.. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసే పరిస్థితికి తీసుకువచ్చారు.. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. చిల్లర రాజకీయాన్ని దేశానికి రుద్దడానికే బీఆర్ఎస్‌ పార్టీ అని ఆరోపించిన ఆయన.. 5 లక్షల కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రం అప్పు చేసిందన్నారు.. ఇక, నా లాంటి వాళ్లు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. నేను బాజప్త అప్పు తెచ్చుకున్నాన్నారు.. ఏ పార్టీ అయినా టికెట్ అడిగితే నీ దగర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడగడం లేదా? కేసీఆర్‌ రాజ్యంలో డబ్బులు లేకుండా ఎన్నికలు లేవని వ్యాఖ్యానించారు.. ఇక, కేసీఆర్‌ మనుషులు అన్ని పార్టీల్లో ఉంటారు.. ఇతర పార్టీలను ఎదగనీయకుండా చేస్తారని ఆరోపించారు.. అన్ని పార్టీల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని.. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమత్రి అమిత్‌షా నేతృత్వంలో ముందుకు వెళ్తామని ప్రకటించారు ఈటల రాజేందర్‌.

Show comments