హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఉదయం 11ః30 గంటలకు బీజేపీలో చేరబోతున్నారు. ఉదయాన్నే ఈటల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢల్లీకి బయలుదేరారు. ఈటలతో పాటుగా మరో 20 మంది కూడా అదే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ జాతీయ ఆధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల, ఆయన అనుచర వర్గం బీజేపీలో చేరనున్నారు. దేవరయాంజల్ భూములను ఈటల అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను కేబినెట్ నుంచి బర్త్‌రఫ్ చేశారు. తన వివరణ కోరకుండానే మంత్రిపదవి నుంచి తొలగించారని, సరైన సమయంలో అన్ని విషయాలు బయటపెడతానని ఈటల గతంలో పేర్కొన్నారు. ఈనెల 12 వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
నేడు బీజేపీలోకి ఈటల… ఢిల్లీకి పయనం…
