Site icon NTV Telugu

Minister Thummala: కాళేశ్వరం నిర్మాణానికి నాకు సంబంధం లేదు.. ఈటల వాంగ్మూలం అసత్యం

Thumalla

Thumalla

Minister Thummala: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమీషన్ కు ఇచ్చిన వాగ్మూలం అసత్యం అన్నారు. అలాగే, కాళేశ్వరం కమిషన్ దగ్గర తన పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియదన్నారు. ఈటల అనాలోచితంగా ఇచ్చారా? చాలా రోజులు అయ్యింది కాబట్టి అలా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితులు దాపురించాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమీషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేసిన సబ్ కమిటీ కాదు.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం సబ్ కమిటీ వేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Read Also: Madhavi Latha: ప్రొఫెసర్ మాధవి లత ఎవరు.? చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి

ఇక, సబ్ కమిటీ నాలుగు ప్రాజెక్టుల నిర్మాణాలపై నిర్ధారణ చేసి నివేదిక ఇచ్చింది అని మంత్రి తుమ్మల అన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని ఈటల రాజేందర్ చెప్పడం అబద్ధం.. కాళేశ్వరం నిర్మాణం కోసం క్యాబినెట్ ఆమోదానికి ఎప్పుడూ రాలేదు అని తేల్చి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మాత్రమే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఈటల చెప్పిన విషయాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్లాయి.. అలా తప్పుడు సంకేతాలు వెళ్ళొద్దనే నేను మీ ముందుకు వచ్చాను.. ఆ తప్పును ఈటల ఎందుకు తన భుజాల మీదకు వేసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Read Also: Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన!

అయితే, నా 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల చెప్పిన సమాధానాలు చూసి బాధ, అనుమానం వ్యక్తమయ్యాయి.. నేనే సుమోటోగా కాళేశ్వరం కమిషన్ కు సబ్ కమిటీ రిపోర్టు, ఇతర వివరాలు అందిద్దామని అనుకుంటున్నాను.. కాళేశ్వరం నిర్మాణానికి నాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇంకా హరీష్ అబద్ధాలు ఆడాలని చూస్తే.. అబద్ధాల హరీష్ అవుతాడు అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయం క్యాబినెట్ ముందుకు వచ్చినట్లు ఏదైనా ఆధారాలు ఉంటే చూపండి అని మంత్రి తుమ్మల సవాల్ విసిరారు.

Exit mobile version