Etala Jamuna: పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదని అన్నారు. నేను పార్టీ మారను అని రాజేందర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. కేసీఆర్ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇటువంటి దుర్మార్గులను ఎదిరిస్తున్నందుకు హాపీగా ఉన్నామని అన్నారు. ముదిరాజ్ లు నిరసనలు చేస్తున్న సీఎం కు కనిపించడం లేదు.. వాళ్ళు చిన్న కులం వాళ్ళే అని అలా చేస్తున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి పిచ్చికుక్క… హుజూరబాద్ ప్రజలకి పిచ్చికుక్క అంటేనే తెలుస్తుందని అన్నారు. మహిళలపై ఇలానే మాట్లాడితే అయన మీద చెప్పుల దండ వేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ లు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు తమ పని తాము చేస్తే బాగుంటుందని అన్నారు. ఈటల బీజేపీలో ఉన్నారు.. పార్టీ లో సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. ఓటు వేసేది ప్రజలు… ప్రజలు అనుకుంటే ఎవరైనా గెలుస్తారని తెలిపారు. నేను పార్టీ మారను అని రాజేందర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఈటల జమున తెలిపారు.
Read also: MLC Kadiyam Srihari: సర్పంచ్ నవ్య రాజయ్య అంశం.. ఎమ్మెల్సీ కడియం కామెంట్స్
మెప్పు పొందేందుకు ఏదేదో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికలప్పుడు కూడా కొందరు చిల్లారగాల్లు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక పిచ్చి కుక్కలాంటి వ్యక్తి నీ ఎమ్మెల్సీ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. అలా చేయమని కేసీఆర్ ఆయన్ని వదిలిపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ప్రజలను ఆ పిచ్చికుక్క హింసిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏ బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఉద్యమ కారుల మీద రాళ్ల దాడి చేసిన పిచ్చికుక్కతో అమర వీరుల స్తూపం నీ కోలగొట్టించాడని మండిపడ్దారు. ఎమ్మెల్సీనీ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ కారులను అవమానించిన వాడు ఎమ్మెల్సీగా ఉండే అర్హత లేదన్నారు. గవర్నర్ పై కూడా అసభ్యంగా మాట్లాడారని అన్నారు. ఈటెల రాజేందర్ పుణ్యమే ఆయనకు ఎమ్మెల్సీ పదవి అని అన్నారు. ఇసుక వాళ్ళ దగ్గర రోజు లక్ష వసూలు చేస్తాడు అట? అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 20 కోట్లు పెట్టి మీ ఈటెల రాజేందర్ ను చంపిస్తా నని కౌశిక్ రెడ్డి అన్నారని ఈటల జమున ఆరోపించారు. కేసీఆర్ చెబితేనే ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఇటువంటి సీఎం అవసరమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు డబ్బులు అవసరం లేదు.. ఓటుతో భూ స్థాపితం చేస్తారని అన్నారు.
Dharmapuri Arvind: మెజార్టీ స్థానాల్లో గెలుస్తాం.. మా స్ట్రాటజీ మాకుంది
