NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: కేసీఆర్ తెలంగాణ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అవ్వడం ఖాయం

Errabelli On Kcr

Errabelli On Kcr

Errabelli Dayakar Rao On CM KCR: తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్ అని, వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధాని అవ్వడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరంగల్‌లోని ఏజే మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన మహానుభావుడు కేసీఆర్ అని, యావత్తు దేశం ఆయన కోసం ఎదురు చూస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం రాష్ట్ర ప్రజలందరికీ ఓ ఉత్సవం లాంటిదని.. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను సాధించారని, రాష్ట్రాన్ని తెర్లు కాకుండా దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. ఇవ్వాళ తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని.. అందుకే దేశం కేసీఆర్ వైపు చూస్తోందని చెప్పారు.

Kishan Reddy.. విమానాశ్రయాల ఏర్పాటుపై కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, కేసీఆర్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ భారీ మెజారిటీతో గెలుస్తారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై తీవ్రంగా మండిపడ్డారు. పిట్టల రాముడిలా పెగ్గెలు కొడుతున్నారని, వాళ్ళతో అయ్యేది లేదు పొయ్యేది లేదని కౌంటర్ వేశారు. కనీస మర్యాదలు.. పెద్దా, చిన్నా తేడా తెలవని మూర్ఖులని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ ఐరన్ లెగ్ అని.. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అని ఆరోపించారు. బండి సంజయ్ ఓ తొండి మనిషని.. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లతో ఒరిగేదేమీ ఉండదని, వాళ్ళను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని దుయ్యబట్టారు.

Laya Gorty: హీరోయిన్ లయ కూతురును చూశారా.. అచ్చుగుద్దినట్లు తల్లిని దింపేసింది

రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేశారని.. విద్య, వైద్య రంగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నామని తెలిపారు. వరంగల్‌లో రూ. 11 వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. అందుకే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని తెలియజేశారు. ప్రైవేట్ వైద్యులు కూడా కేవలం వ్యాపార ధోరణితో మాత్రమే ఆలోచించకుండా.. సేవా ధృక్పథంతో సేవ చేయాలని పిలుపునిచ్చారు.