Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: నేను పార్టీ మారడం లేదు.. పుకార్లు నమ్మకండి..

Yerrabelli Dayakar Rao

Yerrabelli Dayakar Rao

Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ లోనే ఉంటాను.. నేను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ హస్తం పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలసిందే. కాగా.. ఎర్ర బెల్లి దయాకర్ రావు కూడా కషాయం కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రధాన అనుచరుడు.. అయితే ఈయన తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మార్నేని రవీందర్ రావు తోపాటు ఆయన భార్య, ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.

Read also: Tamannaah Bhatia: బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న.. తమన్నా భాటియా

కాగా.. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బీఆర్ఎస్ కు బై బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఆయన కూడా బీజేపీ పార్టీ కండువా కప్పుకునేందుకు సమయం త్వరలోనే వుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ పుకార్లపై ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తాను పార్టీ మారడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు. నా పైన కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పని చేస్తానని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలాహీనపర్చాలని ఇలాంటి దుష్ప్రచారం నాపైన చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దు అని ఆయన తెలిపారు.

Read also: Bandi Sanjay: విద్యార్థులకు ఆ సినిమా చూపించండి.. సీఎం రేవంత్ కు బండి సంజయ్‌ లేఖ

బీఆర్ఎస్ అంటే పేదల పార్టీ…బహుజనుల పార్టీ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బడుగు,బలహీన వర్గాలు ఇప్పుడు ఆలోచిస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో బీసీల నాయకత్వాన్ని టార్గెట్ చేసి ఓడించాలని చేసిన కుట్రలు వెలుగు చూస్తున్నాయన్నారు. కవిత అరెస్ట్ ను ఖండిస్తున్నామని తెలిపారు. లక్షల కోట్లు మింగిన వాళ్ళు విదేశాల్లో ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందని తెలిపారు. పాలన పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే… మరో ఉద్యమం తప్పదన్నారు. బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితిగా ఉంటుందన్నారు. హామీలు నెరవేర్చక పోతే…వచ్చేది మళ్ళి మా ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
Hariah Rao: రైతులకు రూ.10వేలు ఇవ్వండి.. ప్రభుత్వానికి హరీష్‌ రావు డిమాండ్‌

Exit mobile version