ఇవాళ సూర్యగ్రహణం ఏర్పడింది. సాయంత్రం 5.01 నుండి సాయంత్రం 6.26 నిమిషాల వరకు ఉంటుందని పండితులు ముందే చెప్పారు. గ్రహణం సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలి. ఏ విధమైన ఆహారం తీసుకోకూడదు. తులసి ఆకులపై నీటిపై ఉంచితే సూర్య గ్రహణ ప్రభావం తగ్గుతుంది. గ్రహణం వేళ మీ ఇళ్లలోని ఆహార పదార్థాలు, నీళ్లలో గరికను వేయాలి. గ్రహణం సమయంలో గర్బిణులు ఆహారం తీసుకోకూడదు. బయటకు కూడా రాకూడదు.
Read Also:Ram Setu Movie Review: రామ్ సేతు (హిందీ, డబ్బింగ్)
సూర్య గ్రహణం సమయంలో కుర్చీలో లేదా సోఫాలో ప్రశాంతంగా కూర్చొని ఏదైనా పుస్తకం చదవాలన్నారు. ఎవరూ బయటకు రాకూడదు. గ్రహణాన్ని ఎవ్వరూ నేరుగా చూడకూడదు. అలా చేస్తే కంటి చూపు మీద ప్రభావం వుంటుందని పేర్కొన్నారు. అయితే ఇవన్నీ అపోహలు మాత్రమేనని మూఢ నమ్మకాల నిర్మూలన సంస్థ పేర్కొంది.మూఢనమ్మకాలు శాస్త్ర ప్రగతికి అవరోధం అన్నారు. గ్రహణం వేళ ఏం జరగదని, యథావిధిగా తమ పనులు చేసుకోవచ్చని.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు.
సూర్యగ్రహణం సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మూఢ నమ్మకాల నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూర్య గ్రహణం సమయంలో భోజనం చేస్తూ ఇలాంటి మూఢనమ్మకాలు, ప్రజలు నమ్మకూడదని విజ్ఞాన దర్శిని కార్యదర్శి రమేష్ అన్నారు. విద్యార్ధులతో కలిసి గ్రహణం వేళ వారు అల్పాహారం తీసుకున్నారు. దీనికి మంచి స్పందన లభించింది. మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలని ఈసందర్భంగా వారు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం దొంతికుంట తండా సమీపములో సూర్యగ్రహణం కనిపించింది.
దొంతికుంట తండాలో కనిపించిన సూర్యగ్రహణం
Read Also: IND vs PAK Dead Ball Row: అది మోసమేనన్న పాక్ ఫ్యాన్స్‌కి.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన స్టార్ అంపైర్