2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం.. ఆగస్టు 9 నుంచి 31వ తేదీ వరకు ముందస్తు కార్యక్రమాలు. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ కొనసాగనుంది.. 2021 నవంబర్ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుంది.. నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు.. డిసెంబర్ 20 వరకు అభ్యంతరాలు, వినతులు పరిష్కరించనున్నారు.. 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ చేయనున్నారు.. 2022 జనవరి 5న ఓటర్ల తుదిజాబితా ప్రచురించనున్నారు.. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వచ్చే వారు ఓటు హక్కుకు అర్హులు కానున్నారు… WWW.nsvp.in ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్.