సెప్టెంబర్ 17పై తెలంగాణలో రాజకీయం రంజుగా జరుగుతోంది. పార్టీలన్నీ వేడుకలను తలో పేరుతో నిర్వహిస్తున్నాయి. విలీనం అని ఒకరు.. విమోచనమని మరొకరు.. విద్రోహమని ఇంకొకరు.. ఇలా పలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.. పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో స్వతంత్రం వజ్రోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసారు. హైదరాబాద్ నిజాం పరిపాలన నుంచి భారతదేశంలో చేరిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు కేంద్రంలో జవహర్ లాల్ నెహ్రూ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు హైదరాబాదు రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశాడని అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎస్పీ ప్రోద్బలంతోనే టిఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాని ఆవిష్కరించారు.
జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలని సీఎం కేసీఆర్ కోరారు. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రసంగాన్న ముగించారు.
మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దని సీఎం కేసీఆర్ కోరుకున్నారు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలని అన్నారు సీఎం.
ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నానని తెలిపారు కేసీఆర్. మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేల పై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా, ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత అన్నాఉ సీఎం కేసీఆర్.
అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలని సీఎం పేర్కొన్నారు. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.
మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబళిస్తుందని సీఎం పేర్కొన్నారు. మానవ సంబంధాలనే మంట గలుపుతుందని మండిపడ్డారు. జాతి జీవనాడిని కలుషితం చేస్తుందని అన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులన్నారు. ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలీనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్.
దేశం, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని కేసీఆర్ అన్నారు. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు.
యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్ అధికారం లోకి రాగానే tg గా మర్చేస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. అందే శ్రీ గేయం నీ రాష్ట్ర అధికారికి గేయంగా మార్చుతాం అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సృష్టించిన తెలంగాణ తల్లి దొరల కోసం అన్నారు. సబ్బండ వర్గాల తల్లిగా కాంగ్రెస్ తెలంగాణ తల్లి నమూనా విడుదల చేస్తున్నాం ఇవాళ అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జెండా పై సీనియర్ నేతల నుండి సలహాలు వచ్చాయన్నారు. అందరి సలహాలు తీసుకుని జెండా సిద్దం చేస్తామన్నారు.
బీజేపీ ప్రజలను విడగొడుతుంది.. మేము ప్రజలను కలుపుతున్నమన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సొంత చరిత్ర రాయాలని చూస్తున్నారని మండిపడ్డారు. Ts అందులో భాగమే అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే tg గా మర్చేస్తం అన్నారు. అందే శ్రీ గేయం నీ రాష్ట్ర అధికారికి గేయంగా మర్చుతం అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సృష్టించిన తెలంగాణ తల్లి దొరల కోసం అన్నారు. సబ్బండ వర్గాల తల్లిగా కాంగ్రెస్ తెలంగాణ తల్లి నమూనా విడుదల చేస్తున్నాం ఇవాళ అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జెండా పై సీనియర్ నేతల నుండి సలహాలు వచ్చాయన్నారు. అందరి సలహాలు తీసుకుని జెండా సిద్దం చేస్తామన్నారు.
ముస్లిం హిందువుల మధ్య చిచ్చే పెట్టే బీజేపీ అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. గుజరాత్ నుండి కొందరు దేశ దిమ్మరులు హైదబాద్ వచ్చారని అన్నారు. మోడీ ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారా.. మీకు మీరే వచ్చారా..? అని రేవంత్ ప్రశ్నించారు. మోడీ చెప్తే వచ్చేది నిజమని అన్నారు. నిజాం సంస్థానం కూడా దేశంలో విలీనం అవ్వడానికి నెహ్రూ ఆదేశం మేరకు వల్లభాయ్ పటేల్ విలీనం చేశారని అన్నారు.
గుజరాత్ లోని జునే ఘడ్ లో 1948 లో స్వాతంత్య్రం రాలేదని అన్నారు రేవంత్ రెడ్డి. వల్లభాయ్ పటేల్ హో మంత్రి అయ్యాక.. నిజాం, కాశ్మీర్, ఘునాఘడ్ ల్ను భారత్ లో విలీనం కోసం ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. నెహ్రూ ఆదేశాలతో దేశంలో కలిపారని అన్నారు. గుజరాత్ లో జూనే ఘడ్ కూడా హైదరాబాద్ మాదిరిగానే దేశంలో 1948 లో విలీనం అయ్యిందని అన్నారు. జూన్ ఘడ్ కి స్వాతంత్య్రం ఇప్పించి స్వేచ్ఛ ఇచ్చారు నెహ్రూ అని రేవంత్ పేర్కొన్నారు.
గాంధీ భవన్ పునాదులు వేసిందే వల్లభాయ్ పటేల్ అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వల్లభాయ్ పటేల్ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడనని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నీ నిషేధించింది వల్లభాయి పటేల్ అని తెలిపారు. మీ మూలాలు నిషేధించింది వల్లభాయ్ పటేల్ అని గుర్తు చేశారు. ఆయన విగ్రహానికి దండ వేయడానికి బీజేపీ కి హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు తుపాకులు పట్టి తరిమిన చరిత్రమనదని రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు చరిత్ర దొంగిలిస్తున్నరని అన్నారు. రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని తెలిపారు. మతాలు..కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే వాళ్ళు మూర్ఖులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అంటేనే తెలంగాణ .. తెలంగాణ అంటే కాంగ్రెస్ అన్నారు రేవంత్ రెడ్డి. రాజులు, నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినామన్నారు రేవంత్ రెడ్డి. సాయుధ పోరాటం లో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. భూమి కోసం...భుక్తి కోసం.. దండు కట్టిందని అన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య. మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు విరోతోచిత పోరాటం చేశారని రేవంత్ పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో తెలంగాణ స్వాంతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభ మయ్యాయి. జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ల విగ్రహానికి రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నాల నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగరేసిన రేవంత్.. తెలంగాణ గీతంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని కాంగ్రెస్ పాటించింది. జయ జయహే తెలంగాణ పాటను మొదటి సారి రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ పాటించింది.
తెలంగాణ వ్యాప్తంగా సమైక్యతా దినోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాంపల్లి పబ్లిక గార్డెన్స్ లో సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొ్న్నారు. అనంతరం జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్.
పబ్లిక్ గార్డెన్స్‌లో సమైక్యత వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారని అమిత్ షా తెలిపారు.
హైదరాబాద్ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాంతంత్య్రం వచ్చిందని అమిత్ షా అన్నారు. దేశమంతటికి స్వాంతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాంతంత్య్రం వచ్చిందని అన్నారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ పటేల్ ముగింపు పలికారని గుర్తు చేశారు అమిత్ షా.
సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేదని అమిత్ అన్నారు. వేడుకలు నిర్వహించాలంటే ఇప్పటికీ కొందరు భయపడుతున్నారని అన్నారు. ఏ భయం లేకుండా వేడుకలు చేసుకోవాలని కోరుతున్నానని అమిత్‌షా తెలిపారు.
గాంధీభవన్‌లో తెలంగాణ స్వాంతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన కాంగ్రెస్. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఆవిష్కరించారు.
సిరిసిల్లలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ జాతీయజెండా ఎగరవేసారు.
తెలంగాణ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారు అని మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు.. త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయన్న ఆయన.. ఈ దశలో మనందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పి కొడదాం అని పిలుపునిచ్చారు.. వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దాం... సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిద్దాం అన్నారు.. జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుందాం.. ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం అన్నారు మంత్రి హరీష్‌రావు..
సర్దార్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించింది.. ఆయన లేకపోతే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేది అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. వేడుకలు నిర్వహించాలంటే ఇప్పటికీ కొందరు భయపడుతున్నారు అంటూ టీఆర్ఎస్ సర్కార్‌పై సెటైర్లు వేసిన ఆయన.. ఏ భయం లేకుండా వేడుకలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమిత్‌షా..
పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. వేడుకల్లో హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొని జాతీయ జెండా ఎగురవేసారు.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన 1500 మంది కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. కాగా, పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ తలపెట్టిన విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు.
ఇది తెలంగాణ ప్రజల విజయమని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం అధికారికంగా వేడుకలు చేస్తుండటంతో ఇప్పుడు అందరూ చేస్తున్నారని అన్నారు. నిజాంపాలనలో తెలంగాన ప్రజలు బలైపోయారున్నారు. ఇన్ని రోజులు ఈ వేడుకల్ని ఎందుకు నిర్వహించలేదు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారని కిషన్ రెడ్డి అన్నారు. 1948లో సర్దార్ పటేల్ జెండా ఎగరేస్తే.. 74ఏళ్ల తర్వాత అమిత్ షా జెండా ఎగరేశారని తెలిపారు. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ.. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 25ఏళ్ల నుంచి ఈ వేడుకలు నిర్వహించాలని చూస్తున్నామన్నారు. 1948లో నిజాంను ఓడించి జాతీయ జెండాను గర్వంగా ఎగరేశామన్నారు.
హైదరాబాద్ లోని బీఆర్‌కే భవన్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలు అట్టహాసంగా ప్రారంభ మయ్యాయి. బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేసారు.
సిద్దిపేటలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీశ్‌రావు జాతీయజెండా ఎగరవేసారు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్‌లో జాతీయ పతాకాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణ భవన్‌లో తెలంగాణ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా.. జాతీయ జెండాను కె.కేశవరావు ఆవిష్కరించారు.
కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనా కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. 12 బృందాలతో పారామిలిటరీ పరేడ్ లో సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.
హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో కలపాలని నిజాం చూశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశ సమైక్యతకు సర్దార్ బలమైన నిర్ణయాలు తీసుకొన్నారని అన్నారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదన్నారు. దేశ సమైక్యత కోసం అందరూ ముందుకు కదలాలని వెంకయ్య నాయుడు అన్నారు.
నేడు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. జాతీయ జెండా ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపానికి కేంద్ర మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన వేడుకలకు హాజరైన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే , కర్ణాటక రవాణాశాఖ మంత్రి బి.శ్రీరాములు
అర్థం పర్థం లేకుండా పోటీగా రాష్ట్రం సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తుందని బండి సంజయ్ అన్నారు. ఇన్ని రోజులు ఎందుకు వేడుకలు జరపలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇన్ని రోజులు లేంది ఇప్పుడు ఎందుకు జరుపుతున్నావో సమాధానం చెప్పు కేసీఆర్? అని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు.. స్కూల్స్ కి సెలవు ప్రకటించడం అవమానించడమే అని, సెలవు ఇవ్వకుండా వేడుకలు నిర్వహించమని ఆదేశాలు ఎందుకు ఇవ్వలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనేక మంది బలిదానాలు, సర్ధార్ పటేల్ కృషి ఫలితంగా తెలంగాణ దేశంలో విలీనం అయిందిని బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు స్వతంత్రం.. స్వేచ్ఛ వచ్చిన రోజని అన్నారు. రాష్ట్రం మర్చిపోతే కేంద్రం నిర్వహిస్తుందని బండి సంజయ్ తెలిపారు. కిషన్ రెడ్డి ఆద్వర్యంలో అభినవ సర్ధార్ పటేల్ అమిత్ షా సమక్షంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి వద్ద గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా ఎగురవేశారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్లోలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా గన్ పార్క్ దగ్గర లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు., కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రాజ్య సభ సభ్యులు లక్ష్మన్.,మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యే రఘునందన్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.