తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. నిన్న సోమవారం ఈడీ ముందు చికోటి ప్రవీణ్ హాజరైన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ రెండో రోజు ఈడీ కార్యాలయంలో విచారణకు బ్యాంక్ స్టేట్‌మెంట్లతో చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవాలని పేర్కొన్నాడు. తన పేరుతో వచ్చిన ట్వి్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లు ఫేక్ అంటూ అని చికోటి ప్రవీణ్ తెలిపారు.
read also: Karthikeya-2: థియేట్రికల్ ట్రైలర్ కు రంగం సిద్థం!
చికోటి ప్రవీణ్ ఎక్కడ చూసిన అతడి న్యూసే.. రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ.. విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చీకటి సామ్రాజ్యం లింక్‌లు కదులుతున్నాయి.. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగిఉన్న ఆయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే.. చికోటి ప్రవీణ్‌తో పాటు ఈ చీకటి వ్యాపారంలో మాధవరెడ్డి పాత్ర చాలా కీలకమైనదని అధికారులు గుర్తించారు.. పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి క్రమంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడి లక్షల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయి.. చికోటి ప్రవీణ్‌తో పరిచయంతో క్యాసినో సామ్రాజ్య విస్తరణకు దారితీసిందట. మొత్తంగా చికోటి ప్రవీణ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. నిన్న మొదటగా (సోమవారం) ఈడీ ముందు విచారణకు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి హాజరయ్యారు అయితే నేడు బ్యాంక్ స్టేట్ మెంట్లతో ప్రవీన్ చికోటి హాజరయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని తేల్చి చెప్పాడు ప్రవీణ్ చికోటి.