తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది… ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. యూపీ ఓటర్లను బెదిరిస్తూ ఓ వీడియో విడుదల చేయడంపై ఇప్పటికే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని.. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే, ఇప్పటికీ రాజాసింగ్ నుంచి వివరణ రాకపోవడంతపై ఈసీ సీరియస్‌గా స్పందించింది.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఇక, ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ప్రచారం, మీడియా ఇంటర్వ్యూలు మొదలైన వాటిపై 72 గంటల పాటు నిషేధం విధించింది ఎన్నికల సంఘం..
Read Also: Tollywood: రేపు టాలీవుడ్ ప్రముఖుల భేటీ..
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు రాజా సింగ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడం.. ఈ రోజు మధ్యాహ్నం వరకు సమయం పొడిగించాలని కోరినప్పటికీ.. సమాధానం లేకపోవడం దృష్ట్యా, ఈ విషయంలో రాజా సింగ్ ఏమీ చెప్పలేదని భావించవచ్చు.. దీంతో.. ఈసీ తదుపరి చర్యలకు దిగింది. కాగా, యూపీ ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈ నెల 16న నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేస్తాం’ అంటూ రాజాసింగ్ వీడియో విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పటికే యూపీలో వేల సంఖ్యలో జేసీబీలను, బుల్‌డోజర్లను యోగి తెప్పించారు. యోగికి ఎవరెవరు ఓటు వేయలేదో వారిని ఎన్నికల తరువాత గుర్తిస్తాం. జేసీబీ, బుల్డోజర్లు ఎందుకువస్తాయో మీకు తెలుసు కదా.. యూపీలోఉండాలని అకొంటున్నారా..లేదా? బిడ్డా.. యోగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి అంటూ ఆ వీడియోలో హెచ్చరించారు రాజాసింగ్. చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఈసీ.. మరుసటి రోజే నోటీసులు జారీచేసింది. గడువులోగా స్పందించపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. కానీ, ఇప్పటికీ రాజాసింగ్ స్పందించకపోవడంతో.. కేసు నమోదుకు ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం.